వేయించిన శనగలు తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

వేయించిన శనగల గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

వీటిల్లోని విటమిన్ బీ, కోలిన్‌ మెదడు సామర్థ్యాన్ని పెంపొందింప చేస్తాయి.

వెయించిన శనగల్లో పీచు పదార్థం అధికం. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

వీటిల్లో ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతంది

శనగల్లోని పొటాషియం బీపీని నియంత్రించి, గుండెకు మేలు చేస్తుంది

వీటిల్లో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటంతో ఎముకలు కూడా ద్రుఢంగా ఉంటాయి.

శనగల్లోని మాంసకృత్తులు కండరాలను బలోపేతం చేసి దేహదారుఢ్యాన్ని పెంచుతాయి.