భోజనం తరువాత వాకింగ్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం తీసుకున్నాక రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలను నడకతో సులువుగా నియంత్రించవచ్చు

తిన్నాక వాకింగ్ చేస్తే కదలిక పెరిగి పేగుల్లో ఆహారం సులువుగా కదులుతుంది

దీంతో, కడుపులోని ఆహారం త్వరగా దిగువ జీర్ణవ్యవస్థలోకి వెళ్లి కడుపుబ్బరం తగ్గుతుంది.

తిన్న తరువాత రక్తంలో పెరిగే చక్కెరలను కండరాలు మరింత మెరుగ్గా వినియోగించుకుంటాయి

నడకతో శరీరం శక్తి నిల్వలను వినియోగించుకుంటుంది. ఫలితంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది

ఈ అలవాటుతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది

భోజనం తరువాత నడకతో యాసిడ్ రిఫ్లెక్స్ బెడద కూడా తగ్గిపోతుంది.