హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే.. ఇవి తాగాల్సిందే

ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్.. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌ని ఆక్సి‌హిమోగ్లోబిన్‌గా కణజాలాలకు తీసుకెళ్లి, కార్బన్ డయాక్సైడ్‌ని దూరం చేస్తుంది. 

అంతటి కీలకపాత్ర పోషించే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే.. కొన్ని రకాల హెల్దీ జ్యూస్‌లు తాగితే చాలు. అవేంటో తెలుసుకుందాం పదండి.

పీ ప్రోటీన్ షేక్: ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని షేక్ లేదా స్మూతీస్‌లాగా తయారు చేసుకొని తాగొచ్చు.

నువ్వులు, ఖర్జూరంతో చేసిన టేస్టీ స్మూతీలో కూడా ఐరన్, విటమిన్స్, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగితే ఎంతో మంచిది.

పుదీనా జ్యూస్: పుదీనా ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పుదీనా ఆకుల్లో 16 మిల్లీ గ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది.

ప్రూనే జ్యూస్: ఇది ఐరన్‌కి మంచి సోర్స్. ఇది ఐరన్ స్థాయిలను పెంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చేస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్: ఇందులో ఐరన్‌తో పాటు ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్‌ని బాగా ఉపయోగించుకోవడానికి సాయపడతాయి.