బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి రోజు మొత్తానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది
పన్నీర్,గుడ్లు ఈ రెండు కూడా ప్రోటీన్ పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటెమ్స్ వీటిని అందుకే,చాలా మంది తినడానికి ట్రై చేస్తారు.
కోడిగుడ్లని ఉడకబెట్టి తింటాం.ఇందులో ఓ ప్రోటీన్,ఫ్యాట్,కాల్షియం,మెగ్నీషియం,పాస్ఫరస్,పొటాషియం,జింక్,కొలెస్ట్రాల్,సెలీనియంలు ఉంటాయి.
ఇన్ని పోషకాలున్న గుడ్డుని బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అని చెప్పొచ్చు.
కండరాల పెరుగుదల,రిపేర్‌కి హెల్ప్ చేయడమే కాదు.చాలా సేపటి వరకూ కడుపు నిండుగా ఉంచుతుంది.
వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు.కాబట్టి, వీటిని మీరు ఉడకబెట్టి, పొరట, ఆమ్లెట్స్‌లా ఎలా అయినా తీసుకోవచ్చు.
పన్నీర్‌లో ప్రోటీన్,ఫ్యాట్,కార్బోహైడ్రేట్స్,మైక్రోగ్రామ్ ఫోలేట్స్,కాల్షియం,పాస్ఫరస్, పొటాషియంలు ఉన్నాయి.ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉదయాన్నే మంచి క్వాలిటీ పన్నీర్ తినడం వల్ల కండరాల పెరుగుతాయి రోజంతా ఎనర్జీగా ఉంటారు.దీనిని తీసుకోవడం వల్ల మెల్లిగా జీర్ణమవుతుంది.చాలా సేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుంది.
పన్నీర్,గుడ్లలో రెండింటిలోని పోషకాలు సమానంగానే ఉంటాయి.ఇవి రెండు ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు.అయితే, పాల ఉత్పత్తులు, గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.