ఎముకలు, పళ్ల ద్రుఢత్వానికి, బ్లడ్ క్లాటింగ్, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు కాల్షియం కీలకం. ఇది అత్యధికంగా ఉండే శాకాహారాలు ఏవంటే..
కాలే కూరలో కాల్షియం మెండుగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఏ, సీ, కేలు సమృద్ధిగా లభిస్తాయి
సోయాతో చేసే టోఫూలో కూడా కాల్షియం మన శరీరానికి కావాల్సినంత ఉంటుంది.
ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు అత్యధికంగా ఉండే బాదంపప్పుల్లో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది
చియా గింజల్లో కాల్షియంతో పాటు ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్, పీచు పదార్థం, ప్రొటీన్లు ఉంటాయి.
నారింజలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో లభించే విటమిన్ సీ సాయంతో శరీరం కాల్షియంను పూర్తిగా గ్రహిస్తుంది.
వైట్ బీన్స్‌లో ప్రొటీన్, పీచు పదార్థంతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. వైట్ బీన్స్‌ను సూప్, సలాడ్స్‌తో కలిపి తినొచ్చు
సముద్రపు నాచులో కాల్షియంతో పాటు ఐయోడిన్ కూడా కావాల్సినంత లభిస్తుంది.
నువ్వుల్లో కూడా కాల్షియం అధికం
బాదం పాలు, సోయ్ పాలు వంటి వాటిని తాగితే శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది.
Related Web Stories
ఆహారంలో నల్ల మిరియాలు చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
సత్తు పానీయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!
సంతోషకరమైన హార్మోన్లను పెంచే రోజు అలవాట్లు ఇవే..