ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తున్నారా.. జాగ్రత్త !

ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగించి.. వాటిని తాగితే అనర్థాలు తప్పవని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.

పాలను ఎక్కువ సేపు మరిగించడం వల్ల వాటిలోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని చెబుతున్నారు.

ప్యాలను ప్యాక్ చేసే ముందు 71 డిగ్రీల సెల్సియస్ వద్ద బాగా వేడి చేస్తారు.

పాలలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. 

అనంతరం 0 డిగ్రీల వద్ద పాలను చల్ల బరుస్తారు. ఆ తర్వాత ప్యాకెట్లలోకి పాలను నింపుతారు. 

అలా ప్యాకెట్లలోకి వచ్చిన పాలను మళ్లీ ఇంట్లో వేడి చేస్తే.. అందులోని పోషక విలువలు నశిస్తాయని డైటీషియన్లు పేర్కొంటున్నారు.

పాల ప్యాకెట్లలోని పాలను ఇళ్లలో జస్ట్ 5 నిమిషాలు వేడి చేసి... ఆ తర్వాత వాడుకుంటే సరిపోతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు.