పిల్లలకు అత్యుత్తమ పోషకాహారం తల్లిపాలే. తమ పిల్లలకు పాలిచ్చినన్ని రోజులు తల్లులు ఈ 9 పనులు అస్సలు చేయకూడదు.
పాలిచ్చే తల్లులు గర్బనిరోధక మాత్రలు ఉపయోగించకూడదు. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇది పాల రుచి, వాసనపై ప్రభావం చూపిస్తాయి.
పుదీనా, పిప్పరమెంట్ వంటి మూలికలు పిల్లలకు కడుపునొప్పి వంటి సమస్యలు కలిగిస్తాయి. పాలిచ్చే తల్లులు ఇలాంటి గాఢత కలిగిన ఆహారాలు తీసుకోకూడదు.
పిల్లలను చూసుకునే హడావిడిలో చాలామంది మహిళలు తమ గురించి తాము పట్టించుకోరు. మంచి నిద్ర, ప్రతిరోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండడం పాలిచ్చే తల్లులలకు చాలా ముఖ్యం.
పాలిచ్చే తల్లులు ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా రొమ్ములలో మార్పు, పాలివ్వడంలో ఊహించని అసౌకర్యం వంటివి ఎదురైతే వైద్యుడి వద్దకు వెళ్లాలి.
పిల్లలు ఏడుస్తుంటారనే కారణంతో చాలామంది పిల్లల నోట్లో పాలపీక ఉంచుతారు. ఇది పిల్లల నోరు సహజంగా అభివృద్ది చెందడంలో హాని కలిగిస్తుంది. తల్లి పాలివ్వడంలో ఇబ్బందులు కలిగిస్తుంది.
పిల్లలకు కూర్చుని పాలివ్వడం కంటే పడుకుని పాలు ఇవ్వడం మంచిది. దీనివల్ల పిల్లలు హాయిగా నిద్రలోకి జారుకుంటారు.
పాలిచ్చే తల్లులు క్రీములు, లోషన్లు ఉపయోగించకూడదు. పిల్లలు తల్లిముఖాన్ని తాకడం, వేళ్లు నోట్లో పెట్టుకోవడం చేస్తారు కాబట్టి ఈ క్రీములు, లోషన్లను ఉపయోగించడం మానేయాలి.