కంటి సమస్యలను దూరం చేయడానికి ఆయుర్వేదంలో అనేక మార్గాలున్నాయి. అయితే ఈ 4 పనులు చేస్తే కళ్లద్దాలను పక్కన పెట్టేయొచ్చు.
ట్రాటక్ అని పిలిచే ఆయుర్వే ప్రక్రియ ద్వారా కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
చీకటి స్థలంలో కొవ్వొత్తిని వెలిగించి, మూడు మీటర్ల దూరంలో కూర్చుని దానిపై దృష్టి కేంద్రీకరించాలి.
ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటూ కళ్లకు మంచి వ్యయామం దొరకుతుంది.
నేత్ర ధౌతి అనే పద్ధతితోనూ కళ్లను కాపాడుకోవచ్చు. శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
నేత్ర తర్పణం కూడా కళ్లకు మేలు చేస్తుంది. ఔషధాలతో కూడిన నెయ్యిని కళ్లలోకి వేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
త్రిఫల చూర్ణం కూడా కంటికి ప్రయోజనం చేకూరుస్తుంది. త్రిఫల పౌడర్ కలిపిన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల సమస్యలు దూరమవుతాయి.