మన దేశంలో టీ తాగని వారు దాదాపుగా ఉండరు

సందర్భం ఏదైనా సరే నలుగురు వ్యక్తులు ఓ చోట చేరితే కచ్చితంగా టీ తాగాల్సిందే

కొందరు తమ పిల్లలకు కూడా టీ ఇస్తుంటారు.

అయితే, టీ కారణంగా పిల్లలపై కొంత చెడు ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

టీలో సాధారణంగా కెఫీన్, చక్కెరలు అధికంగా ఉంటాయి

టీతో చిన్న పిల్లల మెదళ్లు బలహీనంగా మారతాయి

టీ కారణంగా చిన్నారుల దంతాల ఆరోగ్యం కూడా చెడుతుంది

కెఫీన్ కూడా చిన్నారులకు చెడు చేస్తుంది

సాధారణంగా 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు రోజుకు 100 మిల్లీగ్రాముల కెఫీన్‌కు మించి తీసుకోకూడదు.

చిన్నప్పటి నుంచే హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.