మొలకలొచ్చిన బంగాళ  దుంపలను తినొచ్చా?

మొలకలు వచ్చిన బంగాళ దుంపలను  అస్సలు తినకూడదు.

 మొలకలు వచ్చిన బంగాళదుంపలో గ్లైకోఅల్కలాయిడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

 గ్లైకోఅల్కలాయిడ్స్ చాలా  విషపూరితమైనవి. ముఖ్యంగా పచ్చగా ఉండే భాగాలు మంచివి కావు

అలాంటి ఆలుగడ్డలను తింటే  వికారం, వాంతులు, డయేరియా,  తలనొప్పి ఏర్పడతాయి.

 కొందరిలో నాడీ సంబంధ సమస్యలు  కూడా ఏర్పడతాయి.

ఒక వేళ వాటిని వండాలి అనుకుంటే ఆ మొలకలను, పచ్చగా ఉండే భాగాలను  పూర్తిగా తొలగించాలి.

బంగాళ దుంపలు మొలకలు  రాకూడదంటే పొడిగా ఉండే చల్లని,  చీకటి ప్రాంతాల్లో పెట్టాలి.

బాగా మొలకలు వచ్చి మెత్తబడిన  బంగాళ దుంపలను అస్సలు వాడొద్దు.