చూయింగ్ గమ్ తింటున్నారా..  ఎంత డేంజరో తెలుసా..

చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధనలో తెలింది. ప్రతి గ్రాము చూయింగ్ గమ్‌లో వందల మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కొన్ని బ్రాండ్లలో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయి అధికంగా ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చూయింగ్ గమ్ వినియోగాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.

చూయింగ్‌ గమ్‌ తినే వాళ్లు ప్లాస్టిక్‌ను తింటున్నారని నిపుణులు అంటున్నారు. లాస్‌‌ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం దీనిపై పరిశోధన చేసింది.

చూయింగ్‌ గమ్ నమలడం వల్ల.. తెలియకుండానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నట్లు తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

సాధారణంగా చూయింగ్‌ గమ్‌ను చెట్టు రసం నుంచి తయారు చేస్తారు.అవి చాలా సురక్షితం.

కానీ కొన్ని సంస్థలు తయారు చేస్తున్న చూయింగ్‌ గమ్‌లో మైక్రో ప్లాస్టిక్‌ ఉన్నట్లు శాస్త్రేవేత్తలు కనుగొన్నారు.

నేడు చాలా చూయింగ్ గమ్‌లలో ప్లాస్టిక్ సంచులు, జిగురులలో తరచుగా ఉపయోగించే పాలిథిలిన్, పాలీ వినైల్ అసిటేట్ వంటి సింథటిక్ పాలిమర్‌లు ఉంటున్నాయి.

ఇలాంటి చూయింగ్‌ గమ్‌లను నమిలినప్పుడు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇదే విషయాన్ని వైద్యులు సైతం చెప్పారు.

ఇవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం వెల్లడైన అధ్యయనంలో ప్రతి గ్రాము గమ్ నుండి 100 మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని తేలింది. మరికొన్ని ఉత్పత్తులు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయని పేర్కొంటున్నారు.