భారతీయ సంప్రదాయ వంటకాలైన చట్నీల్లోనూ బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.

పుదీనా చట్నీ..జీర్ణరసాల్ని ఉత్తేజితం చేస్తుంది. ఫలితంగా శరీరానికి పోషకాలు బాగా అంది బరువుపై నియంత్రణ వస్తుంది

కెలొరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే కొత్తిమీర చట్నీతోనూ బరువు సులభంగా తగ్గొచ్చు

టమాటా చట్నీలో నీరు, ఫైబర్ అధికం. దీంతో, ఆకలిపై నియంత్రణ వచ్చి బరువు తగ్గుతారు.

చింతపండుతో చేసే చట్నీల్లో హైడ్రాక్సీసిట్రిక్‌యాసిడ్ ఉంటుంది. ఈ చట్నీలతో చెడు కొలెస్టెరాల్ తగ్గి బరువు నియంత్రణలోకి వస్తుంది.

దోసకాయ చట్నీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇది కూడా ఆకలి తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

పుదీనా, యోగర్ట్‌తో చేసే చట్నీ ఎండాకాలానికి తగినది. బరువు తగ్గేందుకు తోడ్పాటునందిస్తుంది

మామిడితో చేసే పచ్చడిలో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికం. దీంతో కూడా బరువు తగ్గొచ్చు

ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకుతో చేసే చట్నీలో ఫైబర్ ఎక్కువ. ఇది కూడా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.