bad52e0b-546e-4262-82aa-2390a6bbc02f-1.jpg

మంచి నీళ్లు తాగే విషయంలో కొందరు తెలీక పలు తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం.

a857981d-87ad-4e08-b991-62fecc56d918-2.jpg

అన్నం తినకముందు, తిన్నవెంటనే నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పలుచనై అరుగుదల కుంటుపడుతుంది.

281f2233-fa7e-4aa7-b158-afe8abd883f5-3.jpg

ఆహారం తినేటప్పుడు మినహా మరెప్పుడూ నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారినపడొచ్చు.

fadb8837-0c51-4cf0-bcf9-a63b6d27b2a3-7.jpg

గటగటా వేగంగా నీళ్లు తాగకుండా నింపాదిగా తాగడం శ్రేయస్కరం.

దాహం వేసినప్పుడే నీళ్లు తాగడం కూడా తప్పు. తరచూ నీళ్లు తాగితేనే శరీరానికి తగినంత తేమ అందుతుంది

చల్లటి నీరు తాగితే జీర్ణక్రియకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు తాగడమే మంచిది.

తక్కువ సమయంలో ఎక్కువ నీరు తాగితే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

అపరిశుభ్రమైన నీరు తాగితే కచ్చితంగా అనారోగ్యం పాలవుతారన్న విషయం గుర్తుంచుకోవాలి.

తరచూ ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఉన్న నీరు తాగే బదులు గాజు, లేదా రాగి సీసాల్లోని నీరు తాగడం మంచిది.

ఆహానం తింటున్నప్పుడో లేదా కసరత్తులు చేసేటప్పుడో కాకుండా రోజు మొత్తం పలుమార్లు కొద్దికొద్దిగా నీరు తాగాలి.

నిద్రకు ఉపక్రమించే ముందు నీరు తాగితే పలుమార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో, నిద్ర చెడిపోతుంది.