నెయ్యిలో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటంటే.. 

నెయ్యిలోని విటమిన్-ఏ, డీ, ఈ, కే... కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ చిటికెడు మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఈ మిశ్రమం బాగా పని చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సాయం చేస్తుంది.

టీ స్పూన్ నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి, ఆ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.