మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మెంతులు బాగా పని చేస్తాయి. 

మెంతి గింజల్లోని ఫైబర్.. జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. 

కొలస్ట్రాల్ స్థాయిని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు దోహదం చేస్తాయి. 

మొలకెత్తిన మెంతి గింజలు జీవక్రియను మెరుగుపరడంలో సాయం చేస్తాయి. 

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 

ఈ గింజల్లోని కాల్షియం, ఇతర ఖనిజాలు.. ఎముకలను బలోపేతం చేస్తాయి. 

మెంతి గింజల్లోని పోషకాలు చర్మానికి పోషణనిచ్చి మెరిసేలా చేస్తాయి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.