శాఖాహారులు కండలు పెంచేందుకు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

సోయా ఉత్పత్తుల్లో ఉండే బ్రాంచ్ చైన్ అమైనో ఆమ్లాలు కండరాలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

పనీర్‌లోని అమైనో ఆమ్లాలు కండరాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. 

కాయ ధాన్యాల్లోని ప్రొటీన్, డైటరీ, ఫైబర్ తదితరాలు కండరాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. 

క్వినోవాలోని మెగ్నీషియం కండరాల పెరుగుదలకు బాగా పని చేస్తుంది.

బాదం, వాల్‌నట్, అవిసె గింజల ద్వారా కండరాలకు ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రొటీన్లు అందుతాయి. 

గ్రీక్ యోగర్ట్‌లోని ప్రొటీన్, కాల్షియం తదిరాలు కండరాలు బలాన్ని అందిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.