పసుపు,  నల్ల మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

పసుపులోని కర్కుమిన్, నల్ల మిరియాల్లోని పైపెరిన్.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తాయి. 

శరీరంలో మంట, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

క్యాన్సర్ కారక కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. 

పసుపు, నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

పసుపు, మిరియాలను పాలతో కలిపి తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

రోజువారీ ఆహారంలో ఈ రెండింటిని చేర్చితే శరీరం ఫిట్‌గా ఉంటుంది.

అయితే వీటి మోతాదు ఎక్కువైతే వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.