కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను సులభంగా తొలగించవచ్చు.
ఫ్రిజ్‌లో ఉంచిన దోసకాయ ముక్కలను 10 నుంచి 15 నిముషాల పాటు కళ్లపై ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పాలలో నానబెట్టిన కాటన్‌ను 10 నిముషాల పాటు కళ్ల కింద ఉంచాలి. ఆపై పాలతో మసాజ్ చేయాలి.
బంగాళదుంప రసాన్ని అప్లై చేయడం వల్ల కూడా కళ్ల కింద వలయాలను దూరం చేయొచ్చు.
తాజా అలోవెరా జెల్‌ను కళ్ల కింద సున్నితంగా మసాజ్ చేయాలి. దీంతో నల్లటి వలయాలతో పాటూ వాపు కూడా తగ్గుతుంది.
టమాటా రసంలో నిమ్మరసం కళ్ల కింద అప్లై చేస్తే నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
బాదం నూనె లేదా విటమిన్-ఇ క్యాప్సూల్స్ తీసుకుని కళ్ల కింద మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి ఉదయం శుభ్రం చేయాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ సమస్యలు ఉన్నవారు ముల్లంగిని తింటే బోలెడు లాభాలు ..
కలబంద గుజ్జుతో ఇన్ని లాభాలా..!
ఆవు పెరుగు తినడం మంచిదేనా..