డెంగ్యూ విజృంభిస్తోంది..  ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 

అత్యంత ప్రమాదకర డెంగ్యూ కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 

బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా శరీరానికి దోమలను నివారించే క్రీమ్స్ రాసుకోవాలి. 

డెంగ్యూను నివారించాలంటే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. వీలైనన్ని నీళ్లు తాగాలి. 

జ్వరం, తలనొప్పి, జాయింట్ పెయిన్స్ ఉన్నట్టైతే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీరే దోమలకు ఆవాసం.

దోమ కాటు నుంచి తప్పించుకునేందుకు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలి. 

జ్వరం రాగానే స్వంతంగా మందులు కొనుక్కోని వేసుకోవడం కాకుండా, డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకుని తగిన మందులు వాడాలి. 

మురుగు కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ఎక్కువ సేపు ఉండకూడదు

ఒకవేళ డెంగ్యూ సోకినట్టైతే వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి