మధుమేహం ఉన్నదనే సంకేతాలు ఎలా ఉంటాయంటే..

మధుమేహం రాబోతున్నదనే విషయాన్ని శరీరం కొన్ని సంకేతాల ద్వారా హెచ్చరిస్తుంది. 

చర్మం, ముఖ్యంగా మెడ చుట్టూ పాచెస్ అభివృద్ధి చెందుతుంది. ఇది మధుమేహానికి సంకేతంగా చెప్పచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే తరచుగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు.  

అధిక చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటే అది దృష్టి మీద ప్రభావాన్ని చూపుతుంది. 

నరాల బలహీనత, నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు అధిక రక్త స్థాయిలు ఏర్పడతాయనేందుకు సూచనలు.

మధుమేహం పెరిగే అవకాశం ఉంటే వినికిడి లోపం కూడా ఉంటుంది. 

రక్తంలో చక్కెర స్థాయిల్లో ఆకస్మిక మార్పులు, మానసిక మార్పులకు కారణం కావచ్చు.

మధుమేహం నరాలను దెబ్బతీస్తుంది. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. ఇది జలదరింపు, తిమ్మిరిని కలిగిస్తుంది.

మధుమేహానికి అత్యంత సాధారణ ప్రమాద కారకాల్లో బరువు తగ్గడం కూడా ఒకటి.

ఎవరికైనా నోరు పొడిబారుతుంది. అయితే ఇది మధుమేహం ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. లాలాజల ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

మధుమేహం అత్యంత సాధారణ ప్రారంభ లక్షణాలలో ఆకలి పెరగడం కూడా ఒకటి.