ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో.. అవి ఏమిటో తెలుసా?
తినే ఆహారంలో పీచుపదార్థం లోపించడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుంది. ఎండుద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఎండుద్రాక్ష కలిపిన పాలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ పాలు తాగితే అంటువ్యాధులు దరి చేరవు. ఎముకలు బలంగా ఉంటాయి.
పిల్లలకు ప్రతిరోజూ ఎండుద్రాక్ష కలిపిన పాలు ఇస్తే.. కాళ్లు, చేతులు తిమ్మిర్లే కాదు.. నొప్పులు సైతం ఉండవు.
ఎండుద్రాక్షతోపాటు పాలు తీసుకుంటే.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. హృదయ సంబంధిత వ్యాధులు సైతం రావు. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది.
ప్రతి రోజు 5 నుంచి 6 ఎండు ద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వాటిని ఒక గ్లాసు వేడి పాలలో కలుపుకుని తాగాలి. రెండు వారాల్లో ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.