కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే తప్పులివే

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. ఉరుకుల పరుగుల జీవితంలో కళ్ల విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ 5 తప్పులు చేయకండి.

గంటలతరబడి కంప్యూటర్లపై పని చేస్తుంటే 20-20-20 నియమం పాటించాలి. అంటే సిస్టమ్‌పై ఉన్న ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లపాటు విరామం తీసుకోవాలి. 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును తదేకంగా చూస్తుంటే కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. 

కళ్లపై యూవీ కిరణాలు పడకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. 

తలనొప్పి, కళ్లు పొడిబారటం వంటివి కంటి సమస్యలకు ప్రారంభ సంకేతాలు కావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే నయనాల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

హైబీపీ, మధుమేహం కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవాలి. 

కళ్లు దురద పెడుతుంటే సొంతంగా ఐ డ్రాప్స్ వాడకూడదు. వైద్యులు సూచించిన ప్రకారం  నడుచుకోవాలి.

ప్రిస్క్రిప్షన్ లేని గ్లాసెస్ ధరిస్తే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి డాక్టర్లు సూచించిన కళ్లజోడు ధరించాలి.