శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొద్దా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది

ఈ మాసంలో ఎక్కువగా లక్ష్మీదేవి సహా పలు రకాల పూజలు చేస్తారు

దీంతో శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

ఈ క్రమంలోనే చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు

అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది కాబట్టి కోళ్లు, మేకలకు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువ

సూర్యరశ్మి తక్కువ ఉండి శరీరంలో జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక శక్తి కూడా మందగిస్తుంది

ఇలాంటి క్రమంలో మాంసం తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు

ఈ సమయంలో వ్యాధుల ప్రభావం ఎక్కువ కాబట్టి సాధారణ ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు