ఉదయాన్నే టీతో కలిపి  ఇవి మాత్రం తీసుకోవద్దు

టీ తాగాక పెరుగు, నిమ్మరసం వంటివి తీసుకోవద్దు. టీలోని టానిన్, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కలయిక జీర్ణాశయానికి ఇబ్బంది కలిగిస్తుంది.

ఐరన్ ఎక్కువగా ఉండే గింజలు, పచ్చి ఆకు కూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు టీతో కలిపి తీసుకోకూడదు.

 టీ తాగే సమయంలో స్నాక్స్, శనగ పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇవి కొంత మందిలో జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు.

టీ తాగిన వెంటనే పసుపు కలిపిన పదార్థాలను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధక సమస్యలు తలెత్తవచ్చు.

పచ్చి ఉల్లిపాయలతో పాటూ గుడ్డు, సలాడ్, మొలకెత్తిన గింజలను కూడా టీతో తీసుకోవటం శ్రేయస్కరం కాదు.

 టీ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని పదార్థాలు ఏవీ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.