రోజంతా ఉత్సాహంగా  ఉండాలంటే.. ఈ పనులు చేయండి..

సూర్యోదయానికి  ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. 

రోజును ప్రారంభించే ముందు మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి.

నిద్ర లేవగానే ఓ  గ్లాసుడు నీళ్లు తాగండి

ఉదయం లేవగానే మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్ కాకుండా బయటకు వెళ్లి సూర్యోదయాన్ని చూడండి. 

 కొద్ది సేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు రోజంతా మిమ్మల్ని పాజిటివ్‌గా ఉంచుతాయి

ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయండి. చాలా గంటలుగా ఏమీ తినలేదు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఎక్కువైనా ఫర్వాలేదు

 ఆ రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల జాబితా రాసుకోండి. మీ గోల్ ఏంటి.. ఆ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలేంటో ఒకసారి తరచి చూసుకోండి