చెవి పోటుతో బాధపడుతున్నారా  అయితే ఇలా చేయండి!

తులసి ఆకులను దంచి, రసాన్ని వడగట్టి రెండు చుక్కలు చెవిలో పోస్తే, చెవి పోటు అదుపులోకి వస్తుంది.

కొన్ని లవంగాలను నువ్వల నూనెలో వేసి, మరిగించి చల్లార్చాలి. చల్లారిన తర్వాత, వడగట్టి, చెవుల్లో ఒకటి లేదా రెండు చుక్కలు పోయాలి.

మూడు వెల్లుల్లి రెబ్బలను వేడి చేసి, మెత్తగా దంచి, వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టు వేయాలి.

అల్లాన్ని దంచి, రసం తీసి, నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి.

 వేడి నీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె వేసి, ఆవిరి పట్టడం వల్ల సైనస్‌లు శుభ్రమై చెవి పోటు కూడా అదుపులోకి వస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి