టాయిలెట్ లోకి మొబైల్ తీసుకెళ్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!
ఎక్కడికెళ్లినా మొబైల్ తీసుకెళ్లడం చాలామంది అలవాటు. ఆఖరికి టాయిలెట్ లోకి కూడా తీసుకెళ్లిపోతుంటారు. మొబైల్ ను టాయిలెట్ లోకి తీసుకెళ్లం వల్ల కొన్ని నష్టాలుంటాయి.
మొబైల్ ను టాయిలెట్ లోకి తీసుకెళ్తే నెట్ బ్రౌజింగ్ మాయలో పడి గంటలు గంటలు అక్కడే గడిపేస్తారు.
మొబైల్ బ్రౌజింగ్ కారణంగా పరిశుభ్రత గురించి అంతగా పట్టించుకోరు.
టాయిలెట్ లో సూక్ష్మక్రిములుంటాయి. మొబైల్ ను వాష్ రూమ్ కు తీసుకెళ్తే వీటి ప్రమాదం పెరుగుతుంది.
చేతులను ముఖానికి, ముక్కు, కళ్లకు తాకుకుంటాం కాబట్టి టాయిలెట్ లో ఫోన్ ఉపయోగించడం వల్ల ఈ అవయవాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఇంట్లోకంటే బయట పబ్లిక్ టాయిలెట్ లలో పరిశుభ్రత తక్కువ. టాయిలెట్ సీట్ నుండి కుళాయి వరకు అన్ని చోట్లా వ్యాధికారక బ్యాక్టీరియా ఉంటుంది.
టాయిలెట్ వెళ్లి బయటకు రాగానే హ్యాండ్ వాష్ చేసుకున్నా మొబైల్ మీద తిష్ట వేసిన బ్యాక్టీరియా శరీరానికి నష్టం కలిగిస్తుంది.
టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఫైల్స్ సమస్య చాలా తొందరగా వస్తుంది.
మొబైల్ ఫోన్ డిస్ప్లే మీద వ్యాధికారక క్రిములు చాలా ఈజీగా ఆవాసం ఏర్పరుచుకుని అంటువ్యాధులకు కారణం అవుతాయి.