ఆఫీసులో నిద్ర వస్తుందా..  ఈ సింపుల్ ట్రిక్స్  ఫాలో అవ్వండి..!

నిద్ర వచ్చినట్టు అనిపిస్తే    మెడను వృత్తాకారంగా  రెండు దిశలలోనూ తిప్పుతూ  మెడ వ్యాయామం చేయాలి.

వర్క్ చేస్తున్నప్పుడు చేతులను  సాగదీసి మణికట్టును వెనుకగా  వంచి చేతి వేళ్లను బంధించాలి.

కుర్చీలో కూర్చొన్నప్పుడు ఒక  కాలిని కొద్దిగా వంచి మరొక  కాలిని నిటారుగా ఉంచి చైర్  నుండి శరీరాన్ని  ముందుకు వంచాలి.

చేతులను పైకి లేపి చేతి  వేళ్లను బంధించి  భుజాలను సాగదీయాలి.

కూర్చుని ఉండగానే కుడి  చేతిని ఎడమ వైపు, ఎడమ  చేతిని కుడి వైపు చాచుతూ  శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి.

శ్వాస వ్యాయామాలు ఎలాంటి  సమయాల్లో అయినా  సహాయపడతాయి. నిద్ర వస్తే   లోతైన శ్వాస తీసుకుని  మెల్లిగా శ్వాస వదలాలి.

కుర్చీ మీద కూర్చుని  చేతులను  కుర్చీ వెనుకగా ఉంచి గట్టిగా  పట్టుకోవాలి. వీపును సున్నితంగా   వెనక్కు వంచాలి.