జలుబు చేసినప్పుడు ముక్కు  చీదుతున్నారా..

ఈ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు

చలికాలం. దగ్గు, జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటి అనేక సమస్యలు వేధిస్తుంటాయి. 

 ఇలాంటిప్పుడు చాలా మంది ముక్కు చీది ఉపశమనం పొందుతుంటారు.

 ఇలాంటి సందర్భాల్లో ముక్కు గట్టిగా చీదితే చెవికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

 కర్ణభేరికి గాయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

 రెండు రంధ్రాలతో ముక్కు చీదే ప్రయత్నం చేస్తే మధ్య చెవి మరింత దెబ్బతిని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.

 కాబట్టి ముక్కు దిబ్బెడ నుంచి ఉపశమనం కోసం శాలైన్ రిన్సెస్ ట్రై చేయాలని వైద్యులు సూచిస్తున్నారు

వైద్యులకు చెప్పి వారి సూచనలు పాటిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటయాని అనుభవజ్ఞులు చెబుతున్నారు.