కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?

కివి పండు వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. 

ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

గుండె పోటును నియంత్రించడంలో కివి సహాయ పడుతుంది. ఇందులో అధిక శాతం పొటాషియం ఉంటుంది.

ఈ పండ్లలో విటమిన్-ఇతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలని అనుకునే వారు వీటిని తింటే మంచిది.

కివిలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వీటిలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడే వారు ఈ పండ్లు తింటే మంచిది. 

షుగర్ సమస్యతో ఇబ్బంది పడే వారు ఈ పండ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

కివి పండ్లతో ఉండే పోషకాలు.. ఆస్తమాతో ఇబ్బంది పడే వారికి మేలు చేస్తాయి.