తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాకాహార ఆహారాల లిస్ట్ ఇదీ..!
పనీర్.. పనీర్ లో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. పనీర్ కు జతగా బ్రోకలీ, బెల్ పెప్పర్, క్యారెట్ వంటి రంగురంగుల కూరగాయలు జోడిస్తే అధిక ప్రోటీన్ ఆహారం రెఢీ.
శనగలు.. ఉడికించిన శనగలను చాలా రకాలుగా ఆహారంలో తీసుకోవచ్చు.. కేవలం ఉడికించినవే కాదు.. వేయించిన శనగలు కూడా శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తాయి.
పప్పు ధాన్యాలు.. పప్పు ధాన్యాలు చాలా ఆరోగ్యకరమైనవి. ప్రోటీన్ మెండుగా ఉంటుంది. కూరగాయలతో జోడించి వండితే మరెంతో ఆరోగ్యం.
క్వినోవా.. ఈ మధ్యకాలంలో క్వినోవా బాగా వైరల్ అవుతోంది. ఇందులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. క్వినోవాను వివిధ రకాలుగా వండి తీసుకోవచ్చు.
జున్ను.. పనీర్ లాగా జున్ను కూడా చాలామంచి ప్రోటీన్ పదార్థం. దీన్ని బెల్లం,మిరియాలతో కలిపి తీసుకుంటే శరీరానికి ప్రోటీన్ తో పాటు పోషకాలు కూడా లభిస్తాయి.
ఎడమామ్..
సోయాబీన్స్ పచ్చిగా ఉన్నప్పుడు వాటిని ఎడమామ్ అని అంటారు. ఇవి శరీరానికి చాలా ప్రోటీన్ అందిస్తాయి.
గ్రీక్ పెరుగు.. సాధారణ పెరుగు కంటే గ్రీకు పెరుగులో ప్రోటీన్, ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినదగిన కూరగాయలతో జతచేసి తీసుకుంటే మంచిది.
పెసరపప్పు.. పెసరపప్పు మంచి ప్రోటీన్ ఆహారం. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.
Related Web Stories
నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తీసుకుంటే ఎన్ని లాభాలంటే..
దానిమ్మ పండ్లతో ఇన్ని ఉపయోగాలా..
సపోటాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ..