రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరు బ్రష్ చేసేందుకు బద్ధకిస్తుంటారు.

కొందరు రోజుల తరబడి బ్రష్ చేయకుండా ఉంటారు. అయితే 25 రోజుల పాటు బ్రష్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

రోజుల తరబడి బ్రష్ చేయకపోతే దుర్వాసనతో పాటూ నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది.

క్రమంగా దంతాలు పసుపు రంగులోకి మారి బలహీనపడతాయి.

బ్రష్ చేయకపోతే దంతాల్లో కావిటీస్ ఏర్పడి క్రమంగా దెబ్బతింటాయి.

నెల రోజుల పాటు బ్రష్ చేయకపోతే దంతాలు మూలల నుంచి దెబ్బతింటాయి.

చిగుళ్లు బలహీనపడి చివరకు దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.