పాలకూర, క్యారెట్ జ్యూస్  కలిపి తాగితే..  ఏం జరుగుతుందో తెలుసా.. 

పాలకూర, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్లు అందుతాయి. 

ఈ జ్యూస్‌లోని విటమిన్ -A, విటమిన్-C జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.

పాలకూరలోని ఫోలేట్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్ కంటెంట్ జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి.

పాలకూర, క్యారెట్ జ్యూస్‌లోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు.. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

క్యారెట్‌, పాలకూర జ్యూస్ తాగడం వల్ల  రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ జుట్టు పొడిబారకుండా చేస్తాయి.

ఈ జ్యూస్‌లోని విటమిన్లు, మినరల్స్ జుట్టులో  చుండ్రు నివారణతో పాటూ మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.