సిగరెట్ మానలేకపోతున్నారా? ఇలా చేయండి

సిగరెట్ మానాలంటే సెల్ఫ్ మోటివేషన్ ముఖ్యం. ఇందుకోసం కుటుంబ సభ్యులు, డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

సిగరెట్ మానడానికి కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది.  బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.  

వ్యాయామం శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా సిగరెట్, పొగాకు అలవాటును వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది.

సిగరెట్ వైపు మనసు మళ్లితే గ్లాసు చల్లటి నీరు త్రాగాలి. యాలకులను తీసుకోవచ్చు. మౌత్ ఫ్రెషనర్ తినవచ్చు. 

ఆకుకూరలు, లవంగాలు, నల్ల మిరియాలు, పిప్పరమెంటు కూడా సిగరెట్ వైపు మనసు మళ్లకుండా చేస్తుంది.

సిగరెట్ తాగాలనిపించినప్పుడు లవంగాలు, సోపు, యాలకులు, లిక్కోరైస్, దాల్చినచెక్కను తీసుకోండి. నికోటిన్ రీప్లేస్‌మెంట్ గమ్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.