హెర్బల్ టీలు రోగనిరోధక శక్తిని పెంచి అత్యుత్తమ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
హెర్బల్ టీ సహజ సిద్ధమైన మూలికలతో తయారు చేయబడి శరీరానికి పోషకాలు అందిస్తుంది.
వీటిలో రోగనిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి.
మనకు తులసి, అల్లం, పుదీనా, అశ్వగంధ, లెమన్ అండ్ హనీ టీలు అందుబాటులో ఉన్నాయి.
తులసిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తులసి టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు, ఇతర అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తి పెంచుతాయి.
అల్లం టీ తరచూ తాగడం వల్ల శరీరాన్ని చలికాలంలో రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు.
గొంతు నొప్పి, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
పుదీనా టీలో ఉండే లక్షణాలు జీర్ణక్రియకు మేలు చేస్తుంది, శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తుంది.
అశ్వగంధ టీ రోగనిరోధక శక్తి పెంచి శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించడంలో దోహదపడుతుంది.
నిమ్మకాయ రసంతో టీ చేసి అందులో తేనె కలిపితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
వీటి రెండింటి సమ్మేళనం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పెంచి ఇన్‌ఫెక్షన్లు తగ్గిస్తుంది.
Related Web Stories
గాడిద పాలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..
పాలు ఎక్కువగా తాగితే.. ఈ సమస్యలు తప్పవట.. !
సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగే పరిణామాలు ఇవే..!
పటిక నీటితో స్నానం చేస్తే ఇన్ని లాభాలా..