ఫ్రూట్స్ అనగానే ఆపిల్, దానిమ్మ, మామిడి, అరటి వంటి పండ్లే మనకు గుర్తొస్తాయి.
వీటికి భిన్నంగా వేలాది రకాల పండ్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ప్యాషన్ ఫ్రూట్
ప్యాషన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వైద్యులు చెబుతున్నారు.
దీని లోపల జెల్లీ తరహా గుజ్జు, గింజలు ఉంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి.
వివిధ రకాల వంటకాలతోపాటు జ్యూస్, డెసర్ట్‌లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు.
విటమిన్-సితో నిండి ఉండే ఈ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
శరీరంలోని రక్తనాళాలు, మృదులాస్థి, కండరాలకు ఇవి దన్నుగా నిలుస్తాయి.
చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతోపాటు శరీర రుగ్మతలను నయం చేస్తుంది.
శరీర వాపును తగ్గిస్తూ, కణాలు దెబ్బతినకుండా ఈ పండు కాపాడుతుంది.
తగినంత విటమిన్-సి అందిస్తూ జలుబు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
ఆరోగ్యకరమైన కళ్లు, కణాలు, పునరుత్పత్తి, రోగనిరోధక శక్తికి దోహదపడుతుంది.
కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మూత్రపిండాలు, నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Related Web Stories
చెవి పోటుతో బాధపడుతున్నారా అయితే ఇలా చేయండి!
కర్బూజతో ఆ సమస్యలన్నీ దూరం
పైనాపిల్ వారికి విషంతో సమానం..
కొర్రలతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..