యువత చేతులు, మెడ, వీపు వంటి శరీర భాగాలపై పచ్చబొట్లు వేయించుకుంటున్నారు.

ఆడ, మగ అని తేడా లేకుండా ఇప్పుడు అందరూ టాటూలు వేయించుకుంటున్నారు.

అయితే ఒంటిపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేయకూడదని మీకు తెలుసా..

పచ్చబొట్లు వేసే సూదులతో హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, సి వైరస్ వచ్చే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధులు శరీరంలోకి ప్రవేశించిన ఆరు నెలల వరకూ పరీక్షల్లో అవి ఉన్నట్లు తెలియదు.

అందువల్ల పచ్చబొట్టు వేయించుకున్న ఆరు నెలలలోపు రక్తదానం చేయకూడదు.

డాక్టర్లు సైతం ఇలాంటి వారి రక్తాన్ని ఆపద సమయాల్లో తీసుకునేందుకు ఆలోచిస్తారు.

కొందరు డాక్టర్లు అయితే ఇలాంటి వారి రక్తాన్ని సంవత్సరం వరకూ తీసుకోరు.

ఆరు నెలల తర్వాత రక్త పరీక్ష చేయించుకుని వ్యాధులు లేనప్పుడు ఇవ్వొచ్చు.

టాటూ వేయించుకునే సమయంలో కొత్త సూదులు వాడితే రక్తదానం చేయెుచ్చు.