బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

మెదడులో రక్తం సరఫరా నిలిచిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల ఇది వస్తుంది.

బ్రెయిన్ స్ట్రోక్ మానసిక, శారీరక సమస్యలు, అలాగే మరణానికీ దారితీస్తుంది.

అయితే ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

హైపర్‌ టెన్షన్, కొలెస్ట్రాల్ స్థాయి, డయాబెటిస్ వంటివి దీనికి కారణం అవుతాయి.

అధిక రక్తపోటు రక్తనాళాలపై ఒత్తిడి పెంచి చిట్లిపోవడం లేదా రక్తం గడ్డలు కట్టేలా చేస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తం వెళ్లే మార్గాన్ని అది మూస్తేస్తుంది.

షుగర్ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలపై ప్రభావం పడుతుంది.

ధూమపానం, మద్యం, వ్యాయామం చేయకపోవడం వంటివి కారణం అవుతాయి.

ముఖం, చేతులు, కాళ్లలో ఒక్కసారిగా నొప్పి, తిమ్మిరి వంటివి దీని లక్షణాలు.

మాట్లాడే సామర్థ్యం తగ్గడం, తడబడటం, తలనొప్పి, గందరగోళం లక్షణాలు కనిపిస్తాయి.

మంచి జీవనశైలి ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, వ్యాయామం చేయాలి, మానసిక ఒత్తిడి తగ్గించాలి.