హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా? ఈ ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది.

రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం.

అయితే చాలా మంది దీన్ని ధరించి జుట్టు కోల్పోతున్నామంటూ బాధపడుతూ ఉంటారు.

హెల్మెట్ ధరించడం వల్ల నిజంగా జుట్టు రాలదని వైద్య నిపుణులు చెప్తున్నారు.

కానీ దాన్ని సరిగ్గా వాడకపోవడం, శుభ్రం చేయకపోవడంతో సమస్యలు వస్తాయి.

హెల్మెట్ వల్ల గాలి ఆడక చుండ్రు, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

హెల్మెట్‌ను సరిగా పెట్టుకోకపోతే ఫ్రిక్షన్ వల్ల జుట్టుకు కొంత డ్యామేజ్ ఏర్పడవచ్చు.

ఇలాంటి సమస్యలతో తల చర్మంపై రంధ్రాలు క్లోజ్ అయ్యి జుట్టు రాలే ప్రమాదం ఉంది.

హెల్మెట్ పెట్టుకోవడానికి ముందు తలకు కర్చీఫ్ కట్టుకుని ధరించాలని చెప్తున్నారు.

కాబట్టి సరైన సైజ్ హెల్మెట్ పెట్టుకోవాలని, తరచూ శుభ్రం చేసుకోవాలని చెప్తున్నారు.