అధికంగా మద్యం తాగే మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు మద్యం సేవిస్తున్నారు.
అయితే మద్యం తాగే మగవారితో పోలిస్తే ఆడవారికి ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
ఆల్కహాల్ అధికంగా తాగే మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50శాతం పెరుగుతుంది.
రోజుకు ఒకటి కంటే ఎక్కువ డ్రింక్స్ తాగే వారిలో ఈ ప్రమాదం 68శాతంగా ఉంది.
ఎక్కువగా మద్యం తాగడం వల్ల బీపీ వస్తుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
కాలేయం వ్యాధి, హృదయ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి వారిలో మానసిక సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చు.
ముఖ్యంగా గర్భవతులు, గర్భధారణ కోసం చూస్తున్న మహిళలు మద్యం తాగడం చాలా ప్రమాదకరం.
ఇది శిశువు అభివృద్ధిని ప్రభావితం చేసి, పిల్లలు లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.
మీకు తెలిసిన మహిళలు అధికంగా మద్యం తాగుతుంటే హెచ్చరించి, వైద్య సహాయం అందించండి.
Related Web Stories
60 ఏళ్లు దాటినా ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 5 తీసుకుంటే తింటేచాలు..
ఈ 5 హెర్బల్ టీలు బీపీని కంట్రోల్ చేస్తాయ్!
శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !
గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!