ఈ రోజుల్లో ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ జీన్స్‌ ప్యాంట్లు ధరిస్తున్నారు.

అయితే రాత్రిళ్లు వాటిని ధరించి నిద్రపోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జీన్స్‌ బిగుతుగా ఉంటూ గాలి సరిగ్గా ప్రసరించని డెనిమ్ ఫాబ్రిక్‌తో తయారవుతాయి.

ఇలాంటి దుస్తులతో నిద్రించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

జీన్స్‌ చెమట పీల్చుకోవు. దీని వల్ల చర్మంపై ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

ఫలితంగా దురద, దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అలాగే శరీర వేడిని పెంచుతుంది.

జీన్స్‌ వల్ల శరీర భాగాలకు రక్త ప్రసరణ జరగదు. అలాగే నిద్రాభగం జరుగుతుంది.

జీన్స్‌లు కడుపుపై ఒత్తిడి పెంచి ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి.

అలాగే నడుం, తొడలు, పిరుదులు వంటి భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతాయి.

నెలసరి సమయంలోనూ నొప్పి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.