ఊబకాయంతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..!

ఊబకాయం కారణంగా అనేక ఇబ్బందులు స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఎదుర్కొంటూనే ఉంటారు. 

ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.

గుండె సంబంధ వ్యాధులు, టైప్ 2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో ఊబకాయం ముడిపడి ఉంది.

తాజాగా వీర్యకణాల సంఖ్య ఊబకాయంతో తగ్గుతుందని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది.

ఊబకాయం వల్ల మెదడు ప్రభావితం అవుతుందని, మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందనేది అధ్యయానాలు చెబుతున్నాయి. 

హైపోథాలమస్‌లో మార్పులతో టెస్టోస్టెరాన్, స్పెర్మ్‌లను రూపొందించడానికి అవసరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. 

పిట్యూటరీ గ్రంథి మగవారిలో టెస్టోస్టెరాన్, స్పెర్మ్, ఆడవారిలో ఈస్ట్రోజెన్, అండాల ఉత్పత్తిని నిర్వహిస్తుంది.

పునరుత్పత్తిని నియంత్రించే న్యూరాన్‌లలో తక్కువ సినాప్టిక్ కనెక్షన్‌లను ఈ పరిశోధన కనుగొంది.