శరీరంలో వ్యర్థాలను శుభ్రం చేయడంలో కిడ్నీలు కీలకం. అలాంటి కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉండేందుకు చేయాల్సిన 8 పనుల గురించి తెలుసుకుందాం.
మీ ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది.
నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్.. మూత్రపిండాలను శుభ్రం చేయడమే కాకుండా.. రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు దోహదం చేస్తాయి.
తరచూ క్రాన్ బెర్రీస్ తినడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కిడ్నీలను కాపాడుతుంది.
ఆకు కూరల్లోని మెగ్నీషియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
యాపిల్స్‌లోని ఫైబర్ కిడ్నీల్లోని మలినాలను బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది.
పసుపులోని కుర్రుమిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మాత్రపిండాలను అనేక వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి.
డాండెలైన్ వేరు నుచి తయారు చేసే టీ తాగడం వల్ల కిడ్నీల్లోని టాక్సిన్స్ తొలగిపోతాయి.
ఉసిరి, కరక్కాయ, తానికాయతో చేసే త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లోని వ్యర్థాలు తొలగిపోతాయి.
Related Web Stories
Rains: తెలంగాణలో 3 రోజులు వర్షాలు
వేసవిలో తెగవాడేసే AC దుష్పభావాలు ఆరోగ్యంపై ఎలా ఉంటాయంటే..!
సెలెబ్రిటీలు ఇష్టంగా చేసే ఐస్ బాత్ గురించి షాకింగ్ నిజాలివీ..!
వేసవిలో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టే 7 జ్యూస్‌లు