లంచ్ తినే సమయంలో  ఈ పనులు చేస్తున్నారా..  ఇలా చేస్తే బరువు పెరగడం ఖాయం..

ఆకలితో ఉన్నప్పుడు మధ్యహ్నం భోజనం ఆలస్యం చేస్తుంటారు. ఇలా జరిగినప్పుడు మామూలుగా కంటే ఎక్కువ తినేసేందుకు అవకాశం ఉంటుంది. 

 మధ్యాహ్నం భోజనాన్ని తినే పది నిమిషాల ముందు తినే ఆహారాన్ని ఎంచుకోకూడదు.

మధ్యాహ్న భోజనాన్ని  ముందుగా ప్లాన్ చేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి

భోజనంలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. 

బాగా పనిలో ఉన్నప్పుడు, ఒత్తిడితో ఉన్నప్పుడు భోజనాన్ని తినడం వల్ల అతిగా తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.