రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?

మానవ మనుగడకు నీళ్లు ఎంతో అవసరం. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

శరీరంలో ఉన్న మలినాలకు బయటకు పంపించేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

శరీరంలో ఉన్న మలినాలకు బయటకు పంపించేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అయితే.. రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగొద్దని వైద్యులు పేర్కొంటున్నారు.

రాత్రి ఎక్కువగా నీళ్లు తాగితే, నిద్రకు ఆటంకం కలుగుతుంది. మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. 

పొట్ట నిండా నీళ్లు తాగి పడుకుంటే.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 

అంతేకాదు.. గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.

అందుకే.. పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది.

ముఖ్యంగా.. షుగర్ వ్యాధి, రక్త పోటు, గుండె సమస్యలున్నవారు రాత్రిపూట తక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాలి.

రాత్రిపూట మితంగా నీళ్లు తాగితే.. చర్మం హైడ్రేట్‌గా, కాంతివంతంగా తయారవుతుంది.