ఉదయాన్నే పొరపాటున కూడా తినకూడని 5 రకాల పండ్లు ఇవీ..!
విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఈ 5 రకాల పండ్లు ఉదయాన్నే తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్.. నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే కడుపులో చికాకు, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతాయి.
టమోటాలు..టమోటాలలో సిట్రిక్, మాలిక్ యాసిడ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. యాసిడ్ రిఫ్లక్స్ ను మరింత పెంచుతాయి.
అనాసపండు..పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే విరేచనాలు, కడుపు సంబంధింత సమస్యలకు కారణం అవుతుంది.
బెర్రీస్..బెర్రీస్ లో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది.
పుచ్చకాయ..పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నా అందులో ఉన్న ఫ్రక్టోజ్ కారణంగా ఖాళీ కడుపుతో తింటే కడుపు ఉబ్బరం, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.