5ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఆహారాలు తినిపిస్తే.. ఎదుగుదల దెబ్బతింటుందట..

పిల్లలకు ఇచ్చే ఆహారం చాలా ప్రత్యేకంగా ఉండాలి.  

5ఏళ్ళ లోపు పిల్లలకు కొన్ని ఆహారాలు ఇస్తే ఎదుగుదల దెబ్బ తింటుందట. అందుకే వీటిని అస్సలు ఇవ్వకపోవడం మంచిది అంటున్నారు.

పిల్లలకు కెఫీన్ ఆధారిత ఆహారాలు మంచివి కాదు. ఇది పిల్లల నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది.

5ఏళ్ల లోపు పిల్లలకు ప్రాసెస్ చేసిన మాంసం, ప్రాసెస్ ఆహారాలు ఇవ్వకూడదు. ఇందులో అధిక మొత్తంలో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ.  దీని వల్ల ఊబకాయం నుండి అనేక వ్యాధులు వస్తాయి.

ఇప్పట్లో పిల్లలకు ప్రాసెస్ చేసిన, ప్యాక్డ్ ఫుడ్స్ మాత్రమే స్నాక్స్ గా ఇస్తుంటారు.  వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు ఉంటాయి.

ఫాస్ట్ ఫుడ్ లో రుచి తప్ప పోషకాలు ఏమీ ఉండవు.  కేలరీలు ఎక్కువ.  పోషకాహార లోపానికి,  ఎదుగుదలను దెబ్బతీయడానికి కారణమవుతాయి.