జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..

జీలకర్ర వంటింటి మసాలా దినుసుల్లో ప్రధానం. జీలకర్రను సరైన విధంగా ఉపయోగిస్తే  ఒంట్లో పేరుకున్న మొండి కొవ్వు కరిగిపోతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసుడు గోరువెచ్చని జీరకర్ర నీటిని తాగితే జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి నిద్రపోవడానికి  ముందు ఒక చిన్న కప్పు జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.  కొవ్వు పేరుకుపోకుండా సహాయపడుతుంది.

ఆకలిని తగ్గించడానికి,  అతిగా తినకుండా ఉండటానికి భోజనానికి 30 నిమిషాల ముందు జీలకర్ర నీరు తాగాలి.

జీలకర్ర నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడిస్తే శరీరంలో కొవ్వు మరింత సులువుగా  తగ్గుతుంది.

కీర దోస,  పుదీనా వంటివి జోడించి తయారు చేసే డిటాక్స్ డ్రింక్ లో జీలకర్రను జోడిస్తే కొవ్వు ఈజీగా తగ్గుతుంది.

జీలకర్ర నీటిలో అరచెక్క నిమ్మరసం కూడా కలుపుకుని తాగితే శరీరంలో కొవ్వు తగ్గించడంలో మరింత మెరుగ్గా సహాయపడుతుంది.

జీలకర్ర నీటి వల్ల మెరుగైన ఫలితాలు ఉండాలంటే కనీసం 2-3 వారాల పాటు  తాగాలి.

జీలకర్ర నీరు తీసుకుంటూ సమతుల ఆహారం, వ్యాయామం ఫాలో అయితే శరీరంలో కొవ్వు తొందరగా తగ్గుతుంది.