బార్లీ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి.. ఉదయమే ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మలబద్ధక సమస్యతో బాధపడే వారు బార్లీ బియ్యం నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది. 

బార్లీ బియ్యంలోని ఫైబర్.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో బార్లీ నీరు బాగా పని చేస్తుంది. 

టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో బార్లీ బియ్యం నీరు దోహదం చేస్తుంది.

రోజూ బార్లీ బియ్యం నీరు తాగడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేయొచ్చు. 

బార్లీ బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

ఈ నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి సక్రమంగా ఉండేలా చూస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.