కొబ్బరి టీ తాగడ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొబ్బరి పాలు, నీరు, హెవీ క్రీమ్, గ్రీన్ టీ బ్యాగులు, చక్కెరను మిక్స్ చేసి, మరిగించడం ద్వారా కొబ్బెర టీని చేసుకోవచ్చు. 

కొబ్బరి టీలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటూ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 

కొబ్బరి టీలో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు వీలుంటుంది.

కొబ్బరి టీలోని కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. 

కొబ్బరి పాలలోని మెగ్నీషియం, ఐరన్, విటమిన్- సి, పొటాషియం, ఫైబర్... గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

కొబ్బరి టీని అమితంగా తాగితే మాత్రం జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. 

గర్భిణులు, పాలిచ్చే తల్లులు.. ఈ కొబ్బరి టీకి దూరంగా ఉండాలి.